మరోసారి ప్రభుత్వ తీరుపై మండిపడ్డా చంద్రబాబు

ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరసనలకు ప్రజలు మద్దతు తెలపండి

chandrababu naidu
chandrababu naidu

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లేక పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే… ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా కరెంటు శ్లాబులు మార్చి, చార్జీలు పెంచి వాళ్ల మీద బిల్లుల భారం మోపడం అన్యాయమని టిడిపి అధినేత చంద్రబాబు మరోసారి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏపిలో ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడం పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ రోజు నిరసనలకు దిగుతున్నట్లు గుర్తు చేశారు. కాగా ‘లాక్ డౌన్ నేపథ్యంలో 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి. ఆ తర్వాత కూడా పాత శ్లాబు విధానంలో చార్జీలు వసూలు చేయాలి. కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరసనలకు ప్రజలు మద్దతు తెలపాలి’ అని చంద్రబాబు ఈ మేరకు ట్వీట్‌ చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/