మహంకాళి ఆలయంలో మంత్రి తలసాని వరుణ శాంతి యాగం

ఆగకుండా భారీ వర్షాలు పడుతుండటంతో.. తగ్గాలంటూ పూజలు

minister-talasani-worship-in-mahankali-temple-to-reduce-rain

హైదరాబాద్‌ః గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఓవైపు ప్రాజెక్టులు నిండిపోయి, వరదలు వస్తున్నాయి. ఇంకా వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది కూడా. ఈనేపథ్యంలో వరుణుడు శాంతించాలంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

‘‘గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వరుణ దేవుడు శాంతించి వానలు తగ్గాలని సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయని మహంకాళి ఆలయంలో నిర్వహించిన వరుణ శాంతి యాగంలో పాల్గొనడం జరిగింది” అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు యాగం దృశ్యాలను, ఆలయంలో పూజలు ఫొటోలను తలసాని పోస్టు చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/