ది వారియర్ మూవీ టాక్ – రామ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ – ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా తమిళ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ది వారియర్ మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు (జులై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఆదిపినిశెట్టి విలన్ గా నటించగా , దేవి శ్రీ మ్యూజిక్ అందించారు. ట్రైలర్, సాంగ్స్, టీజర్ తో అంచనాలు పెంచేసిన వారియర్..థియేటర్స్ లలో కూడా ఆ అంచనాలను అందుకోవడం సక్సెస్ అయ్యింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా ఫై పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

ఫస్టాఫ్ కాస్త ఫన్నీగా.. సెకండాఫ్‌లో భారీ యాక్షన్ సీన్స్‌ సూపర్‌గా ఉందని , యాక్షన్ ఎపిపోడ్స్‌లో రామ్ తన యాక్టింగ్‌తో దుమ్ములేపాడని అంటున్నారు. డైరెక్టర్ లింగుస్వామికి ఈ సినిమా బౌన్స్ బ్యాక్ అవుతుందని
గట్టిగా చెపుతున్నారు. రామ్‌, ఆది పినిశెట్టిల మధ్య ఫైట్ సీన్లు హోరాహోరీగా సాగాయంటున్నారు. నదియా క్యారెక్టర్ సినిమాగా హైలెట్‌గా ఉందని , కృతి శెట్టి మరోసారి తన గ్లామర్ తో నటన తో కట్టిపడేసిందని చెపుతున్నారు. ఇక చాల రోజుల తర్వాత దేవి తన మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఇచ్చారని ఈ మూవీకి మరింత ప్లస్‌ అయ్యాయని చెబుతున్నారు. ఓవరాల్ గా రామ్ ఖాతాలో ది వారియర్ ఓ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోవడం ఖాయమంటున్నారు.