ప్రజారోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట

Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav

హైదరాబాద్ : తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సనత్‌నగర్‌ నియోజక వర్గం పరిధిలోని మోండా మార్కెట్‌ డివిజన్‌ చాపలబాయి, నాలాబజార్‌, గోషామహల్‌ నియోజక వర్గంలోని అబిడ్స్‌, కామాటి పురాలో ప్రభుత్వ విప్‌ ప్రభాకరరావుతో కలిసి నూతనంగా ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ప్రజారోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. లక్షలాది రూపాయలు ఖర్చుచేసి పేద, మధ్య తరగతి ప్రజలు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో సరైన వైద్యం చేయించుకోలేక పోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఆలోచనల మేరకు అలంటి వారి ఆరోగ్య పరిరక్షణకు ఏర్పాటుచేసిన బస్తీదవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/