వారిని క్షమించేస్తున్నాం: సలా ఖషోగ్గి

అక్టోబర్ 2018లో ఖషోగ్గి హత్య..ఎంబసీలోనే దారుణంగా చంపేసిన నిందితులు

salah-khashoggi

సౌదీ: సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ అక్టోబర్ 2018లో టర్కీ, ఇస్తాంబుల్ నగరంలోని సౌదీ ఎంబసీలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే తమ తండ్రిని దారుణంగా హత్య చేసిన వారిని క్షమించాలని నిర్ణయించుకున్నట్టు సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ కుమారుడు సలా ఖషోగ్గీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. “అమరుడైన జమాల్‌ ఖషోగ్గీ కుమారులమైన మేము, మా తండ్రిని హత్య చేసిన వారికి క్షమాభిక్ష పెడుతున్నాం” అని ట్వీట్ చేశారు. కాగా, అమెరికాతో పాటు సౌదీ పౌరసత్వం కూడా కలిగిన సలా, ప్రస్తుతం సౌదీలోనే ఉంటున్నారు. క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించుకున్న కారణాలపై మాత్రం సలా ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/