అపార్ట్‌మెంట్లలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే వారికీ పోలిసుల హెచ్చరిక

2022 కు బై బై చెపుతూ..2023 కు గ్రాండ్ గా వెల్ కం చెప్పేందుకు యావతా ప్రజానీకం సిద్ధమైంది. ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. ఇక చాలామంది బయటకు వెళ్లకుండా న్యూ ఇయర్ వేడుకలను ఇంట్లోనే జరుపుకునేందుకు సిద్ధమవుతుండగా…పోలీసులు వారికీ పలు హెచ్చరికలు జారీ చేసారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో జరుపుకునే న్యూ ఇయర్ పార్టీలలో పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలని సూచించారు.

పొరుగువారు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే న్యూ ఇయర్ పార్టీలలో మాదకద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మైనర్లను న్యూ ఇయర్ పార్టీలకి అనుమతించకూడదని సూచించారు. అలాగే పార్టీలలో అశ్లీల, అసభ్యకర నృత్యాలకు అనుమతి లేదని నగర పోలీసులు తెలిపారు. వస్త్రధారణ, హావభావాలు, పాటలలో ఎక్కడా అసభ్యకరం ఉండకూదని సూచించారు.

బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చడం, మద్యం తాగడం నిషేధమని, అలా చేస్తే కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అలాగే వాహనాల టాప్స్ ఎక్కడం, డిక్కీలు ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేయకూడదని నిబంధనల్లో పోలీసులు పేర్కొన్నారు.