పవన్..నారాహి ముసుగులో వారాహిలో వచ్చినా ఎవరూ భయపడరు – రోజా

పవన్ కళ్యాణ్ వారాహి ఫై వైస్సార్సీపీ నేతల విమర్శలు ఆపడం లేదు. వరుస పెట్టి ఒకరు కాకపోతే మరొకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా మంత్రి అమర్ నాధ్..తెలంగాణ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారాహి..ఏపీలో ఎలా తిరుగుతుందో చూస్తామని , పవన్ వారాహి నంబర్ 8384 అని, ఈ నాలుగు నంబర్లు కలిపితే 23 అని, అది చంద్రబాబుకు నచ్చిన నంబర్ అని కామెంట్స్ చేయగా..తాజాగా ఏపీ టూరిజం, క్రీడల శాఖ మంత్రి రోజా సైతం వారాహి ఫై మరోసారి విమర్శలు చేసింది.

ట్విట్టర్ లో రెండు ఫొటోలు పోస్టు చేసిన పవన్ కల్యాణ్ ఇక యుద్ధానికి సిద్ధం అంటుంటే జనాలు నవ్వుకుంటున్నారని, పవన్ కల్యాణ్ ‘నారాహి’ ముసుగులో ‘వారాహి’ వాహనంలో వచ్చినా ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. పవన్ పక్క పార్టీల జెండాలు మోస్తాడని, ఆయన రంగు పసుపే అని రోజా వ్యాఖ్యానించారు. జనసేన ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా అని విమర్శించారు. పవన్ వారాంతంలో వచ్చి రాజకీయాలు చేసే వీకెండ్ పొలిటీషియన్ అని ఎద్దేవా చేసారు. ఇలా వైస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తుంటే..జనసేన నేతలు సైతం అదే రేంజ్ లో ప్రతివిమర్శలు చేస్తున్నారు.