మరోసారి ఏపీకి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ నెల 26న మధ్యాహ్నం 12.15 గంటలకు ద్రౌపది ముర్ము శ్రీశైలం కు చేరుకుంటారు. మధ్యాహ్నం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారిని దర్శించుకొని , తర్వాత కేంద్ర టూరిజంశాఖ ద్వారా శ్రీశైలం దేవస్థానం చేపట్టిన ప్రసాదం స్కీమ్ పనులను ప్రారంభించనున్నారు.

ఈ స్కీమ్ ద్వారా ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. టూరిస్టులను ఆకర్షించేందుకు వీలుగా మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. ఇక, రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా.. శ్రీశైలం దేవస్థానం.. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ నెల 4 న ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో జరిగే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.