కెసిఆర్‌ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి

ఇంకో 24 ఏళ్లు ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి

vemula prashanth reddy
vemula prashanth reddy

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. ఇవాళ ముఖ్యమంత్రి కెసిఆర్‌ జన్మదినం పురస్కరించుకొని బంజారాహిల్స్‌లోని తన అధికారిక నివాసంలో మంత్రి వేముల మొక్కలు నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కెసిఆర్‌ ఇంకో 24 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అదే విధంగా దేశానికి ప్రధాన మంత్రి కూడా కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్‌ కుమార్‌ పిలుపు మేరకు ఆయా శాఖల అధికారులు, కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటినట్లు మంత్రి తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/