జపాన్‌ నౌకలో మరో ఇద్దరు భారతీయులకు కోవిడ్‌-19

Board cruise ship in Japan
Board cruise ship in Japan

జపాన్‌: కోవిడ్‌-19 వైరస్ వ్యాపిస్తూనే ఉంది. జపాన్ నౌకలో ఉన్న మరో ఇద్దరు భారతీయులు వైరస్ సోకిందని అధికారులు ధృవీకరించారు. వారికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని.. నెగిటివ్ వస్తే వారిని భారత్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తామని జపాన్‌లో భారత రాయబార కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా వైరస్‌ సోకిన ఇద్దరిని ఆన్షోర్ మెడికల్ కాలేజీకి పంపించినట్టు తెలియజేశారు. మరో ముగ్గురు చికిత్సకు స్పందిస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో ఇద్దరు సిబ్బంది, ఒకరు ప్యాసెంజర్ ఉన్నారు. వారికి జ్వరం కానీ నొప్పి గానీ లేదని చెబుతున్నారని భారత రాయబార కార్యాలయ అధికారులు ట్వీట్ చేశారు. జపాన్ తీరానికి ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో డైమండ్ ప్రిన్సెస్ నౌక వచ్చింది. ఇందులో 3711 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 138 భారతీయులు కాగా.. 132 మంది సిబ్బంది ఉన్నారు. నౌకలో ఉన్నవారికి క్రమంగా కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఈ నెల 12వ తేదీన ముగ్గురు భారతీయులకు లక్షణాలు కనిపించగా.. అదీ ఆదివారానికి ఐదుకు చేరింది. మిగతా ప్రయాణీకులతో కలిపి 355 మందికి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/