కోవిడ్‌-19 ఎఫెక్ట్‌: చైనాలో కొత్త నోట్లు ముద్రణ

China Currency
China Currency

చైనా: కోవిడ్‌-19 వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలోని వుహాన్‌లో వైరస్ జాడ కనిపించిన సంగతి తెలిసిందే. వైరస్ సోకిన వారి సంఖ్య 69 వేలకు చేరగా.. ఇప్పటికే చైనాలో వెయ్యి పైచిలుకు మంది చనిపోయారు. దీంతో వైరస్ మరింత ప్రబలకుండా చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా నగదుతో వైరస్ సోకే అవకాశం ఉన్నందున.. కొత్త నోట్లను ముద్రించాలని నిర్ణయం తీసుకున్నది. వుహాన్ సహా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఆస్పత్రులు, మార్కెట్లు, బస్సులలో నగదును తీసుకొని.. తిరిగి ప్రజలకు ఇవ్వబోమని అధికారులు చెప్తున్నారు. 85.6 బిలియన్ల డాలర్ల యువాన్లను ముద్రిస్తున్నామని చైనా సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఫాన్ యెఫెయ్ పేర్కొన్నారు. ఆయా చోట్ల నగదును తీసుకొని తిరిగి ప్రజల్లోకి పంపించబోమని చెప్పారు. ఆయా నగదును తీసుకొని.. కొత్త నోట్లను చెలామణి చేస్తామని చెప్పారు. పాత నోట్లను 14 రోజుల వరకు ఇతర చోట నిల్వ చేస్తామని చెప్పారు. లేదంటే అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాల్లో నిల్వ చేసి.. వైరస్ జాడ లేదని నిర్ధారించుకొన్న తర్వాత తిరిగి చెలామణి చేస్తామని స్పష్టంచేశారు. వైరస్ లక్షణాలు ఉంటే.. పంపించబోమని తేల్చిచెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/