ఛలో కర్ణాటక పోదాం అక్కడి రైతులను అడుగుదాంః మంత్రి కెటిఆర్‌

Minister KTR participated in the meet the press program

హైదరాబాద్‌ః కర్ణాటక కరెంటు కావాలా.. ? తెలంగాణ కరెంటు కావాలా ? అంటూ తెలంగాణ ప్రజలను మంత్రి కెటిఆర్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…కర్ణాటక కరెంటు కావాలా..తెలంగాణ కరెంటు కావాలా ఛలో ధేక్ లేంగే…కర్ణాటక పోదాం అక్కడి రైతులను అడుగుదాం కరెంట్ ఎలా వస్తుందో అడుగుదామని సవాల్‌ చేశారు. కాంగ్రెస్ నాయకులారా ఒకే బస్సులో వెళదాం కర్ణాటకకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు.

3.5 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. ప్రగతి నివేదికలు సమర్పించి ముందుకెళ్తున్నాం. సోనియాగాంధీ బలిదేవత అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఏపీలో ఎలాగూ కాంగ్రెస్‌ పార్టీ కుప్పకూలిందన్నారు. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ ఆరాటపడుతోంది. రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్‌కు ప్రజలు 55 ఏళ్లపాటు అవకాశం ఇచ్చారు కేంద్రంలో బిజెపికి ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చారని మంత్రి కెటిఆర్‌ పేర్కొన్నారు. బిజెపి ఈ సారి 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతుందని ఎద్దేవా చేశారు.