ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో #ByeByeYSJagan

ట్విట్టర్ లో #ByeByeYSJagan అనే హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రేండింగ్ లో కొనసాగుతుండడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ.. తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు వరుసగా ట్వీట్స్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో కరెంట్ కోతలు కొనసాగుతుండడంతో ప్రతిపక్షాలు , ప్రజలు జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియా లో జగనన్న విసనకర్రల పథకం, 2024లో జగన్ కు ప్రజలు బైబై చెబుతారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రత్యేక హోదా, మద్య నిషేధం, ఉద్యోగ నియామకాలు తదితర హామీలపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు. గత మూడు రోజుల నుంచి #ByeByeYSJagan హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుండడం గమనార్హం.

మరోపక్క రైతులు సైతం జగన్ ఫై మండిపడుతున్నారు. వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీని జగన్‌ తుంగలో తొక్కాడని అంటున్నారు. కనీసం మూడు గంటలు కూడా సరిగా కరెంట్ ఉండడం లేదు పంటపొలాలు ఎండిపోతున్నాయని వారంతా వాపోతున్నారు.