మంత్రి మల్లారెడ్డి ఫై మంత్రి కేటీఆర్ పొగడ్తల వర్షం

మంత్రి కేటీఆర్..మంత్రి మల్లారెడ్డి ఫై పొగడ్తల వర్షం కురిపించారు. తామందరిలోకి మల్లన్నే యువకుడు అని.. తనకు, మల్లారెడ్డికి మధ్య 30 ఏళ్ల వయసు తేడా ఉందని, కానీ అందరికంటే ఆయనలోనే ఉత్సాహం ఎక్కువని కేటీఆర్ ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. కాగా, తన కంటే మల్లారెడ్డి 20 ఏళ్లు పెద్ద అని కేటీఆర్ పేర్కొనగా, కాదు 30 ఏళ్లు పెద్ద అంటూ మల్లారెడ్డి చెప్పారు. ఇక, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మల్లన్న హవానే అని కేటీఆర్ పేర్కొన్నారు.

అందుకే ఆయన వయసు అంచనా వేయలేమని చమత్కరించారు. కష్టపడినా, పనిచేసినా, సక్సెస్ అయినా మల్లారెడ్డి ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన కామెంట్స్ ను మల్లారెడ్డి అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. మాములుగా మల్లారెడ్డి స్పీచ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఏమాత్రం మొహమాటపడకుండా తాను ఎంతలా కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారో సందర్భం వచ్చినప్పుడల్లా చెపుతుంటారు. అందుకే అందరికి మల్లారెడ్డి అంటే ఇష్టం.