టిఆర్‌ఎస్‌ రెబల్‌ నేత దయాకర్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి

కాంగ్రెస్‌ కండువా కప్పి ఆహ్వానించిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డి

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ రెబల్‌ నేత దయాకర్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్కాజ్‌ గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. డబ్బులతో, అక్రమ కేసులతో రాజకీయాలు చేయాలనుకునేవారికి తాజా పరిణామాలు కనువిప్పు అని పేర్కొన్నారు. పీర్జాదిగూడలో కాంగ్రెస్‌ గెలిచి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ వార్డులన్నింటిని సొంతం చేసుకుంటుందన్నారు. కాగా దయకర్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌లో మంత్రి మల్లారెడ్డి అనుచరుడిగా కొనసాగుతున్నారు. ఆయన మల్కాజ్‌ గిరి పరిధిలోకి వచ్చే పీర్జాదిగూడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవిని ఆశించారు. దీనికి టిఆర్‌ఎస్‌ అదిష్టానం అంగీకరించకపోవడంతో దయాకర్‌ రెడ్డి పార్టీని వీడినట్లు సమాచారం.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/