పదేళ్ల వరకు తమదే అధికారం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి సురేఖ

తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడెప్పుడు ముందుకు వెళ్తుంది. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని లాభాల్లోకి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఎన్నికల హామీలను సైతం 100 రోజుల్లో అమలు చేసేలా కసరత్తులు మొదలుపెట్టారు. రేపటి నుండి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టబోతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరించబోతుంది. రేపటి నుండి జనవరి 06 వరకు ఈ దరఖాస్తులను ప్రభుత్వ అధికారులు స్వీకరించనున్నారు. ఇదిలా ఉంటె తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఫై అంత మాట్లాడుకుంటున్నారు.

బీఆర్ఎస్ నాయకులు ఇంకా తామే అధికారంలో ఉన్నట్లు భావిస్తున్నారన్నారు. వచ్చే పదిహేనేళ్లు తామే అధికారంలో ఉంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు పగటి కలలు కంటున్నారన్నారు. కాంగ్రెస్ శ్వేత పత్రం నిజమని.. బీఆర్ఎస్ స్వేద పత్రం అబద్ధమన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి కూడా బిఆర్ఎస్ నేతలు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఎవరికీ వారు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మంత్రి సురేఖ ఆగ్రహం వ్యక్తం చేసారు.