పోలీసులు అదుపులోకి ఐపీఎస్​ అధికారి నవీన్ కుమార్

సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లను సృష్టించి భన్వర్ లాల్ ఇల్లును కాజేసే ప్రయత్నం చేశాడు. దీంతో సీసీఎస్ పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నవీన్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా నవీన్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు.

2014లో జూబ్లీహిల్స్‌లోని నివాసాన్ని సాంబశివరావుకు ఐదేళ్లకు రెంటల్ అగ్రిమెంట్ చేశాం. 2019లో అగ్రిమెంట్ గడువు ముగిసిన తర్వాత ఖాళీ చేయమన్నాం. రెంటల్ అగ్రిమెంట్ కు విరుద్ధంగా నవీన్ కుమార్ అదే ఇంట్లో ఉంటున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. మా ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నారు అని నవంబర్ 17న భన్వర్ లాల్ సతీమణి మనీలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ జరిపి నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు.