అప్పులు దాచి, ఆదాయాన్ని పెద్దగా చేసి చూపొద్దు – సీఎం రేవంత్

CM Revanth Reddy

తెలంగాణ సీఎం గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటీకే అప్పుల్లో ఉన్న తెలంగాణ ను మరింత అప్పుల్లొకి తీసుకెళ్లకుండా చూస్తున్నారు. ఈరోజు బుధువారం ఆర్థిక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు చేశారు.

కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్రానికి పేరు వస్తుందనే బేషజాలకు పోవద్దన్నారు. కొత్త వాహనాలు కొనకుండా ఉన్న వాటినే వాడుకోవాలని సూచించారు. 2024-25 వార్షిక బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబించాలన్నారు. ఆర్భాటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ సిద్ధం చేయాలనీ తెలిపారు. ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాలపై ప్రజలకు వాస్తవం చెబుదామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే వచ్చిందనుకుని బడ్జెట్ తయారు చేయాలన్నారు. ప్రజా శ్రేయస్సే అంతిమలక్ష్యంగా బడ్జె్ట్ కసరత్తు జరగాలన్నారు. ఆదాయ, వ్యయాలపై అంచనాలు పక్కాగా ఉండాలన్నారు. హామీల అమలుకు వ్యయ అంచనాలు పక్కాగా ఉండాలన్నారు. ప్రజలకు అర్థమయ్యేలా బడ్జెట్ రూపకల్పన జరగాలన్నారు.