కరీంనగర్ లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి గంగుల

కరీంనగర్ నగరపాలక సంస్థ 18వ డివిజన్ రేకుర్తి వెంకటేశ్వర కాలనీలో.. ఒక రూ.కోటి 90 లక్షలతో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రికి డివిజన్ వాసులు శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. తెలంగాణలో కరీంనగర్ ను రాష్ట్రంలో రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగరపాలక సంస్థలో విలీనం అయిన డివిజన్‌ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. రేకుర్తి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అభివృద్ధికి నోచుకోలేదని, రేకుర్తి 18,19 డివిజన్ల అభివృద్ధికి అత్యధికంగా నిధులు కేటాయించామని తెలిపారు. ప్రారంభించిన పనులన్నీ నెల రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుధగుని మాధవి కృష్ణా గౌడ్, ఏదుల్ల రాజశేఖర్ వి.రాజేందర్ రావు, భూమా గౌడ్, జంగిలి సాగర్ మహేష్ , గుగ్గిళ్ల శ్రీనివాస్, తుల బాలయ్య బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీద్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.