కరీంనగర్ మెడికల్ కళాశాల క్లాస్ రూమ్ లకు మంత్రి గంగుల భూమి పూజా

కరీంనగర్ మెడికల్ కళాశాల క్లాస్ రూమ్ లకు మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 7 కోట్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం కొత్తపల్లి విత్తన శుద్ధి క్షేత్రంలో మేయర్ సునీల్ రావు, కొత్తపల్లి చైర్మన్ రుద్ర రాజులతో కలసి మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. త్వరలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ లను భర్తీ చేసి NMC కీ నివేదిక అందజేస్తామని ఈ సందర్బంగా మంత్రి ప్రకటించారు.

కళాశాలకు NMC (నేషనల్ మెడికల్ కమీషన్) అనుమతులు రాగానే అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. రెండు, మూడు నెలల్లో ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు ప్రారంభించి ఆగస్టు 2023లో తరగతులు ప్రారంబిస్తామన్నారు. ఈనెల 18తారీఖున NMC బృందం పరిశీలించి వెళ్ళిందని తెలిపారు. రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆశయ సాధన దిశగా ముందడుగు పడిందన్నారు. కరీంనగర్ జిల్లాకు 100 MBBS సీట్లతో మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.