టీడీపీ పార్టీ కి వైసీపీ మంత్రి అనిల్ సవాల్..

వైసీపీ మంత్రి అనిల్..అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఫై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో మీము ఒంటరిగా బరికి దిగుతున్నాం..మీరు కూడా ఒంటరిగా బరిలోకి దిగుతారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ లో క‌నీసం ఒక్క నాయ‌కుడయినా పొత్తు లేకుండా పోతామ‌ని చెప్ప‌గ‌ల‌రా? అని ఆయ‌న నిల‌దీశారు. ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొందలేక‌పోతోన్న టీడీపీ త‌మ‌పై అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని మండిప‌డ్డారు. పొత్తు లేకుండా బరిలోకి దిగే దమ్ము లేదు కానీ మాఫై విమర్శలు చేసేందుకు దమ్ము వస్తుందని అనిల్ అన్నారు.

శాసనమండలిలో ప్రతి రోజు మాదిరిగానే ఈరోజు కూడా గందరగోళం నెలకొంది. వైసీపీ సభ్యుడు రుహుల్లా ప్రమాణ స్వీకారం వేళ సభలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆ సమయంలో మంత్రి అనిల్ టీడీపీ పైన విరుచుకు పడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ చేసి సభ బహిష్కరించి బయటకు వెళ్లిన అంశాన్ని ప్రస్తావించారు. టీడీపీ నేతలు ఎవరైనా.. పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పే ధైర్యం ఉందా అంటూ నిలదీసారు. సభలో ఉన్న ఏ టీడీపీ సభ్యుడు అయినా..ధైర్యం ఎంటే టీడీపీ సింగిల్ గా పోటీ చేస్తుందని చెప్పాలని ఛాలెంజ్ చేసారు. ఒక మైనార్టీ సభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే టీడీపీ సభ్యులు అడ్డుకోవటం పైన వైసీపీ సభ్యులు నిలదీసారు.