సన్యాసి గెటప్ లో షాక్ ఇచ్చిన సమంత

సమంత ప్రస్తుతం ఈ పేరు గట్టిగా వినిపిస్తుంది. అక్కినేని నాగ చైతన్య తో విడాకుల అనంతరం సినిమాల ఫై ఫోకస్ చేసిన సామ్..లేడి ఓరియంటెడ్ , వెబ్ సిరీస్ , హీరోయిన్ పాత్రలే కాక ఐటెం సాంగ్స్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఈ మధ్యనే పుష్ప మూవీ లో ఐటెం సాంగ్ చేసి పాన్ లెవల్లో పాపులార్టీ తెచ్చుకుంది. ప్రస్తుతం యశోద తో పాటు శాకుంతలం మూవీస్ చేస్తుంది. ఇక సోషల్ మీడియా లోను మొదటి నుండి యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది.

సినిమా తాలూకా విశేషాలు, పర్సనల్ విషయాలతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ వారికీ నిద్ర పట్టకుండా చేస్తూ వస్తుంది. ఇదిలా ఉంటె తాజాగా సన్యాసి గెటప్ లో కనిపించి ఆశ్చర్య పరిచింది. వైట్‌ డ్రెస్‌, మెడలో దండ వేసుకుని.. అచ్చం సన్యాసిలా కనిపించింది. దీంతో అందరూ సమంత సన్యాసం తీసుకుంటుందని కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ గెటప్ వెనుక రహస్యం ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.