ధాన్యం కోనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు : బండి

ఇప్ప‌టికే పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి పీయూష్ ప్ర‌క‌ట‌న‌
ధాన్యం కొనుగోళ్ల‌పై రాష్ట్ర స‌ర్కారు అబ‌ద్ధాలు ఆడుతోంద‌న్న సంజయ్

bandi-sanjay

హైదరాబాద్ : యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్ర‌భుత్వంపై పోరాడేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైన విష‌యం తెలిసిందే. ఇందులో కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్న నేప‌థ్యంలో దీనిపై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కేసీఆర్ మళ్లీ వరి అంటున్నార‌ని బండి సంజ‌య్ విమర్శించారు. కేంద్రం వరి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, కొనే బాధ్యతలు తాము తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశామ‌ని తెలిపారు. ధాన్యం కోనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చారని ఆయ‌న అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోళ్ల‌పై అబ‌ద్ధాలు ఆడుతోంద‌ని అన్నార‌ని తెలిపారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం కావాల్సినంత ధాన్యాన్ని ఇవ్వ‌లేక‌పోతోంద‌ని పీయూష్ గోయల్ అన్నార‌ని బండి సంజ‌య్ గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక భారీగా ధాన్యం కొనుగోళ్లు జ‌రుపుతోంద‌ని అన్నారు. ఈ విష‌యాల‌న్నీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు తెలుస‌ని, అయినా తెలియ‌న‌ట్లు ఉంటార‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ఇదే అంశంపై కేంద్ర ప్ర‌భుత్వంపై నింద‌‌లు మోపడానికి కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/