సోమవారం రాత్రి రూబీ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో ఫైర్ ఆక్సిడెంట్ ఎలా జరిగిందో..వీడియో ఇదిగో

సోమవారం రాత్రి సికింద్రాబాద్ లోని రూబీ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం 8 మందిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రమాదంలో మరణించిన వారందరూ దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడకనే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే వీరు తెలిపింది నిజమో కాదో అనే అనుమానాలు నెలకొని ఉండగా..తాజాగా తాజాగా విడుద‌లైన రూబీ హోట‌ల్ సీసీటీవీ ఫుటేజీ డాక్టర్స్ తెలిపింది నిజమే అని తెలిపింది. ఈ వీడియోలో హోట‌ల్ సెల్లార్‌లో ఉన్న ఎల‌క్ట్రిక్ బైకుల వ‌ద్ద తొలుత పేలుడు సంభ‌వించ‌గా… ఆ త‌ర్వాత ప‌లు బైకులు వ‌రుస‌గా పేలిన‌ట్లు సీసీటీవీ ఫుటేజీలో క‌నిపిస్తోంది. అంతేకాకుండా అక్క‌డ జ‌రిగిన పేలుడుతోనే ద‌ట్ట‌మైన పొగ‌లు లాడ్జిని చుట్టుముట్టిన‌ట్లు అందులో స్పష్టంగా క‌నిపిస్తోంది. దీని బట్టి ప్రమాదం ఎలా జరిగిందో క్లారిటీ గా తెలిసిపోయింది.

ఈ అగ్నిప్రమాదంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోడీ.. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని ఆశించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు పీఎంఓ ట్విటర్ ద్వారా తెలిపింది.

మృతుల్లో ఏడుగురు పురుషులు, మహిళ ఉన్నారు. వీరి వయసు 35 నుంచి 40 ఏళ్లలోపు అని సమాచారం. మరో పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో విజయవాడకు చెందిన ఎ.హరీశ్‌, చెన్నై వాసి సీతారామన్‌, దిల్లీ వాసి వీతేంద్ర ఉన్నట్లు గుర్తించారు.