ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

బాన్ టోల్‌ప్లాజా వద్ద కాల్పులు

encounter
encounter

జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని జాతీయ రహదారిపై బాన్ టోల్‌ప్లాజా దగ్గర శుక్రవారం ఉదయం భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదుకుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జాతీయ రహదారి పై బన్నాటోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ముగ్గురు ఉగ్రవాదులు ఓ ట్రక్ లో వచ్చి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన సీఆర్ పీఎఫ్ జవాన్లు తిరిగి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని జమ్మూ ఇన్ స్పెక్టరు జనరల్ ముకేష్ సింగ్ చెప్పారు. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద నుంచి ఏకే 47 రైఫిల్, మేగజైన్స్, గ్రెనెడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కథువా, హీరానగర్ సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడ్డారని అనుమానిస్తున్నట్లు జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/