స‌మాజ్ వాదీ పార్టీలో చేరిన దేశంలోనే పొడవైన వ్యక్తి

పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేతల వ్యాఖ్య

The tallest man Pratap Singh joined the sjp
The tallest man Pratap Singh joined the samajwadi party

దేశంలోనే అత్యంత‌ పొడ‌వైన వ్య‌క్తి., యూపీకి చెందిన ధ‌ర్మేంద్ర ప్ర‌తాప్ సింగ్ స‌మాజ్ వాదీ పార్టీలో చేరారు .. ఈయన ఎత్తు ఎనిమిది అడుగుల ఒక అంగుళం. 2.4మీట‌ర్లు. ప్ర‌పంచ రికార్డుకంటే 11సెంటీమీట‌ర్లు త‌క్కువ‌. ఇదిలా ఉండగా, అఖిలేశ్ యాద‌వ్ నాయ‌క‌త్వం, ఎస్పీ పార్టీ విధానాలు న‌చ్చ‌డంతో ఆయన తమ పార్టీలో చేరార‌ని అధికార ప్ర‌తినిధి రాజేంద్ర చౌద‌రి తెలిపారు. అత‌ని రాక‌తో పార్టీ మ‌రింత బ‌లం పుంజుకుంటుంద‌ని చెప్పారు.

పొడవు ఉండడంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా : ప్రతాప్ సింగ్

చాలా పొడవు ఉండడంతో తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్టు ఈ సందర్భంగా ప్రతాప్ సింగ్ చెప్పారు. పొడవు ఎక్కువ ఉండడం వల్ల ఎవరూ ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని, వివాహం చేసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదన్నారు. అయితే, ఈ పొడవు కారణంగా తాను సెలబ్రిటీ అయిపోయినట్టు.. ప్రజలు తనతో ఫొటో తీసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారని చెప్పారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/