కుటుంబ కారణాలతో విప్రో సీఈవో రాజీనామా

Abidali Neemuchwala
Abidali Neemuchwala

బెంగళూరు: కుటుంబపరమైన కారణాలతో విప్రో సీఈవో తన బాధ్యతల నుండి తప్పుకొంటున్నట్లు ఆయన ప్రకటించారు. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం విప్రో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో) పదవికి అబిదాలీ నీముచ్‌వాలా శుక్రవారం ఉదయం రాజీనామా చేసినట్లు ప్రకటించారు. 75 సంవత్సరాలకు పైగా గొప్ప చరిత్ర కలిగిన విప్రోకు సేవ చేయడం నాకు లభించిన గౌరవం. మా ప్రయాణంలో మేము గుర్తించదదగిన పురోగతని సాధించాము. మా డెలివరీ విభాగాన్ని అభివృద్ధి చేశాము. కస్టమర్ల వ్యవస్థను వ్యవస్థికరించాము అని ఈ రోజు ఉదయం విడుదల చేసిన ప్రకటనలో నీముచ్‌వాలా తెలిపారు. ఇన్ని సంవత్సరాలుగా తనకు సహాయ సహకారాలందిచినందుకు చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ, ఆయన కుమారుడు రిషాద్‌ ప్రేమ్‌జీ, డైరెక్టర్లు, సహోద్యోగులు, వినియోగదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/