ఏప్రిల్ 01 నుండి వీటి ధరలు పెరుగుతున్నాయి..వీటి ధరలు తగ్గుతున్నాయంటే..!

మరో రెండు రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకాబోతుంది. దీంతో ప్రతి ఒక్కరి చూపు వీటి ధరలు పెరుగుతున్నాయి..వీటి ధరలు తగ్గుతున్నాయి అనేది తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం అందుతున్న బిజినెస్ లెక్కల ప్రకారం చాల వాటి ధరలు పెరగబోతున్నాయి.

ధరలు పెరగబోయే వస్తువుల జాబితాలో ప్రైవేట్ జెట్ విమానాలు, హెలికాప్టర్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, ఆభరణాలు, హై-గ్లోస్ పేపర్, విటమిన్లు ఉన్నాయి. కిచెన్ ఎలక్ట్రిక్ చిమ్నీలపై కస్టమ్స్ టాక్స్ 7.5 శాతం నుంచి 15 శాతానికి పెంచింది.

ధరలు తగ్గే వస్తువుల జాబితాలో..కెమెరా లెన్స్‌లు, మొబైల్ ఫోన్‌లు, ల్యాబ్‌లో తయారుచేసిన వజ్రాలు, లిథియం-అయాన్ బ్యాటరీల కోసం ఉపయోగించే మెషీన్లు, ఈవీ ఇండస్ట్రీకి సంబంధించిన ముడి పదార్థాలు చౌకగా మారనున్నాయి. అంతేకాకుండా ఆటవస్తువులు, బైస్కిల్స్, టీవీ, మొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఎల్ఈడీ టీవీలు, మిథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ యాసిడ్, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాల ఉన్నాయి.