సంకుచిత దృష్టితో ఆలోచించకూడదు

దావోస్: ప్రతి దేశం తమ ప్రయోజనాల విషయంలో పునరాలోచిస్తోంది. అయితే, వలసదారులకు అనుకూలంగా ఉన్న దేశాలకే ప్రజలు వస్తారు. వారిని ఆకర్షించడంలో విఫలమయ్యే దేశాలు టెక్నాలజీ పోటీలో ఓడిపోతాయి అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల హెచ్చరించారు. ప్రభుత్వాలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని..సంకుచిత దృష్టితో ఆలోచించకూడదన్నారు. భారత్ విషయంలో తాను ఆశావాదినేనన్నారు. దేశ నిర్మాణంలో భారత్కు 70 ఏళ్ల చరిత్ర ఉందని, అది గట్టి పునాది అని తాను భావిస్తున్నానన్నారు. నేను భారత్లో పుట్టి పెరిగాను. ఆ ఘనమైన వారసత్వానికి గర్విస్తున్నాను. దానివల్ల నేను ప్రభావితుణ్ని అయ్యాను అని వివరించారు. దావోస్లో ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/