బీజింగ్‌లో కరోనా విజృంభణ

దాదాపు 30 ప్రాంతాలు లాక్‌డౌన్

Beijing virus situation ‘extremely severe,’ warns

బీజింగ్‌: చైనా రాజ‌ధాని బీజింగ్‌లో క‌రోనా వైర‌స్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఆ న‌గ‌రంలో ప‌రిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. జిన్‌పాడి మార్కెట్‌లో కేసులు బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత‌.. సుమారు ప‌ది ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారు. అయితే కోవిడ్‌19 కేసులు మ‌ళ్లీ పెర‌గ‌డం ప‌ట్ల అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో భారీ స్థాయిలో టెస్టింగ్ నిర్వ‌హిస్తున్నారు. న‌గ‌ర ప్ర‌జ‌లంద‌రికీ వైర‌స్ టెస్టింగ్ చేప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త 5 రోజుల్లో బీజింగ్ వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 106కు చేరింది. న‌గ‌రంలోని దాదాపు 30 ప్రాంతాల‌ను లాక్‌డౌన్ చేసిన‌ట్లు ఇవాళ ఓ అధికారి తెలిపారు. బీజింగ్‌లో మ‌హమ్మారి వ‌ల్ల ప‌రిస్థితి అత్యంత ప్ర‌మాద‌క‌రంగా ఉన్న‌ట్లు ఆ న‌గ‌ర ప్ర‌తినిధి జూ హెజియాన్ తెలిపారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/