ఆస్ట్రేలియాలో కూలిపోయిన కెనడా విమానం

మెల్బోర్న్/సిడ్నీ: గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కార్చిచ్చును అదుపు చేసేందుకు వచ్చిన కెనడా విమానం అల్పైన్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో అందులోని ముగ్గురు సిబ్బంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా అమెరికన్ పౌరులేనని చెప్పారు.. మొనారో మంచు ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో బతికి బయటపడలేదని న్యూసౌత్‌వేల్స్ రాష్ట్ర రూరల్ ఫైర్ సర్వీసెస్ కమిషనర్ షేన్ ఫిట్జ్‌సిమ్మన్స్ తెలిపారు. పూర్తి స్థాయిలో నీటిని నింపుకున్న ఈ వాటర్ ట్యాంకర్ విమానం కార్చిచ్చు మంటలను అదుపు చేసే క్రమంలో కూలిపోయిందన్నారు. ఈ విమానాన్ని కెనడియన్ అగ్నిమాపక సంస్థ కౌల్సన్ ఏవియేషన్ లీజుకు తీసుకున్నదని ఫిట్జ్‌సిమ్మన్స్ వివరించారు. కార్చిచ్చు మంటలను అదుపు చేసేందుకు వచ్చిన విమానాల్లో ఇది రెండోదన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/