ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నాదల్‌ దూకుడు

Rafael Nadal
Rafael Nadal

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ దూసుకెళ్తున్నాడు. రెండో రౌండ్‌లోనూ వరుస సెట్లలో 20వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ వేటలో మరో ముందంజ వేశాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో కరోలినా ప్లిస్కోవా, సిమోనా హలెస్‌ వరుస సెట్ల విజయాలతో సత్తాచాటారు. ఇక జెలీనా ఒస్టాపెంకోకు మళ్లీ నిరాశ ఎదురైంది.గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో నాదల్ 63, 76(4), 61తో ఫెడ్రికో డెల్బోనిస్‌ (అర్జెంటీనా)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. తొలి సెట్‌ను నాదల్ 63తో నెగ్గినా.. రెండో సెట్‌లో డెల్బోనిస్‌ పోటీ ఇచ్చాడు. ఇక మూడో సెట్‌లో విజృంభించిన రఫా 61తో నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకొన్నాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/