తానా ఛార్లెట్‌ విభాగం ఆధ్వర్యంలో అన్నార్తుల కోసం ఫుడ్‌ డ్రైవ్‌

Food Drive

ఛార్లెట్‌ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్‌ విభాగం ఆధ్వర్యంలో అనార్తులకోసం ఫుడ్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 10,000మందికి అవసరమైన ఆహార పదార్ధాలను వారు సేకరించి అర్బన్‌ మినిస్ట్రీకి అందజేశారు. జనవరి 11వ తేదీన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు తానా నాయకులు, ఇతరులు పాల్గొన్నారు. తానా కమ్యూనిటీ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ మల్లి వేమన మాట్లాడుతూ, దాతలు, ఇతరుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. మల్లి వేమనతోపాటు శ్రీనివాస్‌ చందు గొర్రిపాటి, నాగ పంచుమర్తి, పట్టాభి కంఠమనేని, సత్య వేమూరి, టాగోర్‌ మల్లినేని, రమణ అన్నె, సతీష్‌ పుల్లెల, పార్థ, రాము రెడ్డి కోడం, శివ, షణ్ముగ బత్తినేని తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. ఫుడ్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఛార్లెట్‌ తానా టీమ్‌ను అధ్యక్షులు జే తాళ్ళూరి అభినందించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/