మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణ లో రెడ్ అలర్డ్

మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ తెలంగాణ ఫై కూడా పడింది. ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి నెల్లూరు నుంచి ఓడరేవు వైపు కదులుతున్న మైచాంగ్ తుపాను మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది. ఇది బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఓ మోస్తరు నుండి భారీ వర్షం పడుతుంది. దీంతో ఈరోజు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్ లో ఉదయం నుండి కూడా భారీ వర్షం పడుతుంది. రాష్ట్రంలో అనేక జిల్లాలో వర్షం పడుతూనే ఉంది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఇక ఏపీ లో తూఫాన్ ఎఫెక్ట్ భారీ గా ఉంది. తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. విపరీతమైన ఈదురుగాలులతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏపీ తడిసి ముద్దయింది. పలు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి. భారీ వర్షాలకు ప్రధాన వీధుల్లో రాకపోకలు స్తంభించాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారుల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడంతో.. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నేడు, రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.