లాక్‌డౌన్‌ను పొడిగించిన తొలి రాష్ట్రంగా ఒడిశా

ఈ నెల 30 వరకు పొడగిసున్నట్లు ప్రకటించిన నవీన్‌ సర్కార్‌

naveen patnaik
naveen patnaik

భువనేశ్వర్‌: దేశంలో విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 14 తో ముగియనుంది. కాని పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ను పొడగించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఈ తరుణంలో ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒడిశాలో ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ పొడగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అందుకు అనుగూనంగా ఈ నెల 30 వరకు రాష్ట్రంలో రైలు, విమాన సర్వీసులు ప్రారంభించవద్దని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/