ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం ‘మీటర్ ‘ ట్రైలర్

కిరణ్ అబ్బవరం నుండి వస్తున్న మీటర్ తాలూకా ట్రైలర్ విడుదలైంది. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. రీసెంట్ గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా తో వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్..ఇప్పుడు మీటర్ అంటూ ఏప్రిల్ 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్లాప్ – మైత్రీ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక విభిన్నమైన కథాంశంతో రాబోతున్న ఈ మూవీ ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే సినిమా తాలూకా ప్రమోషన్స్ ను భారీగా చేస్తూ వస్తున్న మేకర్స్..తాజాగా బుధువారం మేకర్స్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. అనుకోకుండా పోలీస్ అయి ఆ తర్వాత ఎవరిని పట్టించుకోకుండా తాను రాసుకున్న రూల్స్ ప్రకారమే జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉండే ఒక పోలీస్ గా కిరణ్ అబ్బవరం కనిపిస్తున్నారు. ట్రైలర్ లో కిరణ్ అబ్బవరం ఎంట్రీ అయితే యాక్షన్ ప్యాక్డ్ ఎంట్రీగా కనిపిస్తోంది. అలాంటి హీరో ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ గ్రామంలోనే ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడితో గొడవ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అప్పటి వరకు అల్లరి చిల్లరగా తిరిగిన ఆయన డ్యూటీ మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి సీరియస్ గా తీసుకుంటాడు. ఇక కిరణ్ సరసన తమిళ భామ అతుల్య రవి చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. విజువల్స్ గ్రాండ్గా అనిపించాయి.. సాయి కార్తీక్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో విజువల్స్ ని మరో లెవల్ కి తీసుకెళ్లాడు. ఓవరాల్ గా ట్రైలర్ తో సినిమా ఫై మరింత ఆసక్తి నింపారు.

YouTube video