నేడు జాతినుద్దేశించి మోడీ ప్రసంగం

సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈమేరకు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోడీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ గురించి కూడా ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/