కృష్ణ ధర్మ రక్షణ అధ్యక్షుడు ఫై కరాటే కళ్యాణి పోలీసులకు పిర్యాదు

కృష్ణ ధర్మ రక్షణ అధ్యక్షుడు కెల్లా దుర్గారావు మహిళలను కించపరిచేలా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడని, అతడి ఫై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కరాటే కళ్యాణి పిర్యాదు చేసింది. ఆడవారి అందం గురించి తప్పుగా మాట్లాడుతూ చేసిన వీడియోపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మేకప్, లిప్ స్టిక్ వంటి సౌందర్య సాధనాలు వాడే మహిళలను అసభ్యపదజాలంతో దూషిస్తూ కించపరిచాడని ఆమె ఆరోపించారు. ధర్మరక్షణ పేరుతో విజయవాడ వేదికగా ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆమె పిర్యాదు లో పేర్కొన్నారు.

ముఖానికి పౌడర్ రాసుకోవడం, లిప్ స్టిక్ వేసుకోవడం ఏదో నేరం అన్నట్టు మాట్లాడుతున్నాడని, సౌందర్య సాధనాలను వాడే మహిళలందరినీ తిడుతున్నాడని కరాటే కళ్యాణి ఆరోపించారు. అందంగా తయారైతే తప్పా? స్త్రీలు అందంగా తయారవ్వకూడదా? అని ప్రశ్నించారు. హిందూ ధర్మం కోసం మహిళలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని.. తనతో పాటు ఒక ట్రాన్స్ జెండర్ కూడా ఉన్నారని.. ఆమె కూడా సౌందర్య సాధనాలు వాడుతుంది. అది కూడా తప్పేనా అని ప్రశ్నించారు. మహిళను కించపరిస్తే ఊరుకునేది లేదని ఆమె అన్నారు.