వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పై ఉండవల్లి విమర్శలు

అమరావతి : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పై విమర్శలు గుపించారు. పాలకులకు కనిపించాల్సింది ప్రజలు కానీ ప్రత్యర్థులు కాదని అన్నారు. అధికారంలోకి వచ్చింది ప్రత్యర్థులపై తీర్చుకోవడానికి కాదని ఆయన సూచించారు. కరోనా వ్యాప్తి నివారణలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. ధర పెంచితే మద్యం తాగేవారు తగ్గుతారు అనుకోవడం భ్రమ అని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేశ్‌పై సీఎం జగన్ ఎందుకు అభద్రతాభావంతో ఉన్నారని ప్రశ్నించారు. ప్రెస్‌మీట్ పెట్టి నిమ్మగడ్డ రమేశ్‌పై మాట్లాడటం ఘోరమైన చర్య అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఏం చేసినా ఊరుకోవడానికి అక్కడుంది ఎల్వీ సుబ్రహ్మణ్యం కాదు… అక్కడుంది నిమ్మగడ్డ రమేశ్, ఏబీ వెంకటేశ్వరరావు అని ఉండవల్లి పేర్కొన్నారు. ప్రజలకు రూ.80,500 కోట్లు పంచుతామని ప్రభుత్వం అంటోందన్న ఉండవల్లి… అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/