హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..అతి త్వరలో అందుబాటులోకి స్కై వాక్

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ను తగ్గించేందుకు GHMC తో కలిసి ప్రభుత్వం ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్ల ను ప్రారంభించగా..మరికొన్ని సిద్ధం అవుతున్నాయి. ఇక ఇవే కాదు అతి త్వరలో స్కై వాక్ కూడా అందుబాటులోకి రాబోతుంది. మెహిదీపట్నంలో నిర్మాణమవుతున్న స్కైవాక్ ఈ ఏడాది మే నెలలో అందుబాటులోకి రానుంది. 11 ఎలివేటర్లతో 390 మీటర్ల పొడవుతో ఈ స్కైవాక్ నిర్మిస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ రూ.32.97 కోట్లతో ఈ స్కైవాక్ నిర్మిస్తోంది. మొత్తం 390 మీటర్ల పొడవులో మెహిదీపట్నం బస్టాండ్ నుంచి డిఫెన్స్ సరిహద్దు వరకు 50 మీటర్లు, మెహిదీపట్నం నుంచి రైతు బజార్, ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ వరకు ఇంటర్మీడియట్ టన్నెల్ వాక్ 160 మీటర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. స్కైవాక్ PV నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేకి ఆనుకుని నిర్మితమవుతోంది.

స్కైవాక్‌లో ఐదు యాక్సెస్ పాయింట్‌లు (హాప్-ఆన్ స్టేషన్‌లు, లేదా ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్‌లు) ఉన్నాయి. రైతు బజార్, డిఫెన్స్ కాంపౌండ్ వాల్, బస్ బే ఏరియా (మెహదీపట్నం), ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ మరియు రేమండ్ షోరూమ్ (గుడిమల్కాపూర్ జంక్షన్) సమీపంలో ఉన్నాయి. స్కైవాక్‌లో కాఫీ షాప్‌లు, లాంజ్ స్నాక్స్ మొదలైనవి కూడా ఉంటాయి, HMDA బస్ స్టాప్ పైన 21,061.42 sft వాణిజ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది.