నేడు తెలుగు రాష్ట్రాల్లో 14 మెడికల్ కాలేజీలు ప్రారంభం

నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి కాదు , రెండు కాదు ఏకంగా 14 మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ లో 9 కాలేజీలు ప్రారంభం కాబోతుండగా..ఏపీలో 5 మెడికల్ కాలేజీ లు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయంశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి ఎంబీబీఎస్ క్లాస్‌లు ప్రారంభం అవుతాయి.
ఇక ఏపీలో ఐదు మెడికల్ కళాశాలల ప్రారంభానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుడుతున్నారు. విజయనగరం , రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ప్రారంభం తరువాత ఐదు కళాశాలల విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతారు జగన్. అలాగే అక్కడ ఏర్పాటుచేసిన స్కిల్ ల్యాబ్, బయోకెమిస్ట్రీ ల్యాబ్, అనాటమీ మ్యూజియంలను పరిశీలిస్తారు.