బిజెపితో ఎందుకు కలుస్తున్నారో పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలి

పాచిపోయిన లడ్డూలు ఇచ్చిదంటూ విమర్శించిన పవన్‌ కళ్యాణ్‌ ఇపుడు ఢిల్లీలో జేపి నడ్డా బందరు లడ్డూలు ఇచ్చారా?

k ramakrishna
k ramakrishna

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై సీపీఐ నేత రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. బిజెపితో ఎందుకు కలుస్తున్నారో పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గతంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బిజెపి ఇవ్వనందుకు పవన్‌ కళ్యాణ్‌ బిజెపితో కలుస్తున్నార అని ప్రశ్నించారు. పాచిపోయిన లడ్డూలను ఇచ్చిందంటూ బిజెపిని విమర్శించిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఢిల్లీలో నడ్డాను కలిసిన తర్వాత పవన్‌కు బందరు లడ్డూలు ఇచ్చారా? అని ఎద్దేవా చేశారు. కేవలం దమ్మున్న వారే బిజెపికి వ్యతిరేకంగా మాట్లడగలరని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఆయనకు దమ్ముందో, లేదో ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు. ఇతర ప్రాంతాల నుండి ఢిల్లీకి వెళ్తున్న నేతలంతా జేఎన్యూకు వెళ్తున్నారని పవన్‌ మాత్రమే బిజెపి ఆఫీసుకు వెళ్లారని రామకృష్ణ దుయ్యబట్టారు. చేగువేర తనకు ఆదర్శమని చెప్పినా పవన్‌ ఇప్పుడు చెంగువీర అయ్యారని రామకృష్ణ ధ్వజమెత్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/