మ‌ళ్ళీ తెర‌పైకి ఆటోజానీ..

గాడ్ ఫాదర్ తో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి..ప్రస్తుతం కథలపై ఫోకస్ చేసారు. ఈ క్రమంలో ఆటోజానీ కథను తెరపైకి తీసుకొచ్చి డైరెక్టర్ పూరి లో ఆశలు రేపారు. గాడ్ ఫాదర్ మూవీ లో డైరెక్టర్ పూరి ఓ ముఖ్య పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధ‌వారం రాత్రి చిరంజీవి అండ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ మ‌ధ్య ఆన్‌లైన్‌లో జ‌రిగిన ముచ్చ‌ట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

గ‌తంలో చిరంజీవితో పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా చేయాల్సి ఉండ‌గా చివ‌రి నిముషంలో మిస్ అయ్యింది. పూరీ చెప్పిన ఆటో జానీ క‌థ చిరంజీవికి న‌చ్చినా, రాజకీయాల్లో నుండి బయటకు వచ్చాక ఆ టైమ్‌లో ఆ స‌బ్జెట్ క‌రెక్ట్ కాద‌ని, త‌మిళ్ మూవీ క‌త్తి రీమేక్ చేసి ఖైదీ నెంబ‌ర్ 150తో చిరంజీవి హిట్ కొట్టారు. తర్వాత వరుసగా రీమేక్ కథలు చేస్తూ వస్తున్నాడు. గాడ్ ఫాద‌ర్ మూవీ ద్వారా మ‌ళ్ళీ క‌లిసిన చిరంజీవి , పూరి లు బుధ‌వారం రాత్రి జ‌రిగిన చిట్ చాట్ ద్వారా చిన్న హింట్ ఇచ్చారు. ముందుగా పూరీ జ‌గ‌న్నాథ్‌ని కొత్త క‌థ‌లు, కొత్త స్క్రీన్ ప్లేల గురించి చిరంజీవి అడిగారు. ఆ త‌ర్వాత ఆటో జానీ స్క్రిప్ట్ ఉందా చింపేశారా అని అడ‌గ్గా, ఆ స‌బ్జెట్‌ని ప‌క్క‌న పెట్టేశాన‌ని, మీ కోసం మ‌రో ప‌వ‌ర్ ఫుల్ స‌బ్జెక్ట్ రెడీ చేస్తున్నాని చెప్పాడు పూరీ. మీరు ఎప్పుడు వ‌చ్చినా క‌థ వినేందుకు తాను సిద్ధంగా ఉంటాన‌ని, ఆల్వేస్ వెల్‌క‌మ్ అని చిరంజీవి రిప్లై ఇచ్చారు. దీంతో మరోసారి చిరు-పూరి మూవీ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.