ఎదురుకాల్పులు..మావోయిస్టు మృతి

encounter
encounter

రా§్‌ుపూర్‌: ఈరోజు ఉదయం ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని బాష‌గూడ అట‌వీ ప్రాంతంలో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందిన‌ట్లు జిల్లా ఎస్పీ క‌మ‌లోచ‌న్ క‌శ్య‌ప్ తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల‌పై రూ. ల‌క్ష రివార్డు ఉన్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. జిల్లా రిజ‌ర్వ్ గార్డ్‌, సీఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొన‌సాగుతోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/