సోనియా, రాహుల్ గాంధీల‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో నేడు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎంపీ రాహుల్‌, ఖ‌ర్గే, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరిపోతున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఈ భేటీకి ప్రాధాన్య‌మేర్ప‌డింది. కానీ.. రాబోయే గుజ‌రాత్ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే, గుజ‌రాత్ పోల్స్‌పై చ‌ర్చించ‌డానికే ఈ భేటీ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. గుజ‌రాత్‌తో పాటు రాబోయే 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల విష‌యంలో బ్లూప్రింట్‌పై కూడా చ‌ర్చించే ఛాన్స్ ఉంద‌ని ఢిల్లీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌లు, గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చార‌ బాధ్య‌త‌లు కూడా అధిష్ఠానం పీకే చేతిలో పెడ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. పీకే శిష్యుడు సునీల్ క‌నుగోలుకు కూడా ఇదే త‌ర‌హా బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌బోతున్నార‌న్న ప్ర‌చార‌మూ వుంది. మ‌రి ఎవ‌రిని వ్యూహం బ‌రిలోకి దింప‌నున్నారో తెలియ‌డం లేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/