ఈ నెల 10 వరకు పలు రైళ్లు రద్దు

సికింద్రాబాద్‌ డివిజన్‌లో మరమ్మత్తులు

Many trains are canceled till 10th of this month

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ డివిజన్‌లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్‌ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. కాజీపేట-డోర్నకల్‌, భద్రాచలం రోడ్‌-విజయవాడ, డోర్నకల్‌-కాజీపేట, విజయవాడ-భద్రాచలం రోడ్‌, కాజీపేట-సిర్పూర్‌ టౌన్‌, సికింద్రాబాద్‌-వరంగల్‌, వరంగల్‌-హైదరాబాద్‌, సిర్పూర్‌ టౌన్‌-కరీంనగర్‌ రైళ్లను రద్దు చేశారు. సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రైళ్లను రద్దుచేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా ఏపిలోని విజవాయడ రైల్వే డివిజన్‌ పరిధిలో కూడా పలు రైళ్లను అధికారులు రద్దుచేశారు. గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం-మచిలీపట్నం రైలును ఈ నెల 5 నుంచి 10 వరకు, విశాఖపట్నం-గుంటూరు రైలును 6 నుంచి 11 వరకు, విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్ను 5, 6, 8, 9 తేదీల్లో రద్దు చేశారు. ఇక గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌, మచిలీపట్నం-విశాఖపట్నం, విశాఖపట్నం-లింగంపల్లి రైళ్లను ఈ నెల 9 వరకు, లింగంపల్లి-విశాఖపట్నం, రాయగడ-గుంటూరు, విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ రైళ్లను ఈ నెల 10వ తేదీ వరకు రద్దుచేశారు.