తెలుగు రాష్ట్రలకు భారీ వర్షాలు!

heavy-rain
heavy-rain


విశాఖపట్నం: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా తెలుగు రాష్ట్రలకు కుండపోతగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు తెలిపింది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో ఒక మాదిరి వర్షాలు, కోస్తా తీరం వెంబడి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. అల్పపీడనం బలపడుతున్న కారణంగా మత్స్యకారులను సముద్రం లోపలికి వెల్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులతోపాటుగా పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/