విజయనగరం జిల్లాలో ఘోరం : అన్న అనే పదానికే మచ్చతెచ్చాడు

ఈరోజుల్లో సమాజంలో వావివరుసలు మరచిపోతున్నారు..తోడబుట్టిన వారిని సైతం కడతేర్చే ప్రయత్నం చేస్తున్నారు. అభం శుభం తెలియని వారిపై రెచ్చిపోతున్నారు. పోలీసులు , కోర్ట్ లు , ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన వాటికీ ఏమాత్రం భయపడడం లేదు. మొన్నటి వరకు ఉత్తర ప్రదేశ్ లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతూ వచ్చాయి. కానీ ఇక ఇప్పుడు ఏపీలో కూడా దారుణాలు ఎక్కువై పోతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో చెల్లెలి ఫై అన్న అత్యాచారం చేసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.

వివరాల్లోకి వెళ్తే

జిల్లాలోని డెంకాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదోతరగతి చదువుతోంది. ఆమెతో పెదనాన్న కుమారుడు చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికఫై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీశానని ఎవరికైనా చెప్తే వాటిని సోషల్ మీడియా లో పెడతానని బాలికను బెదిరించాడు. దీంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. మూడు నెలల క్రితం బాలికకు అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమెకు పరీక్షలు చేయగా.. ఆమె మూడు గర్భవతి అని.. అప్పటికే అబార్షన్ అయిందని తెలిపారు. డాక్టర్స్ చెప్పగానే తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు.

దీనిపై బాలికను నిలదీయడంతో పెదనాన్న కుమారుడే ఈ పనిచేశాడని బాలిక బోరున విలపించింది. ఐతే బయటకు చెప్తే పరువుపోతుందని ఎవరికీ చెప్పొద్దంటూ బంధువులు, కుటుంబ సభ్యులు బాలిక తల్లిదండ్రులకు సూచించారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయిన తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.