సీఎం జగన్ ను కలిసిన మంచు మనోజ్

చేయబోతున్న పనులను సీఎంగారి నుంచి తెలుసుకున్నానని ట్వీట్

Manchu Manoj meets CM Jagan

అమరావతి : సీఎం జగన్ ను సినీ నటుడు మంచు మనోజ్ కలిశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించాడు. ‘దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి జగన్ గారిని కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని మనోజ్ ఈ సందర్భంగా తెలిపాడు. రానున్న సంవత్సరాల్లో చేయబోతున్న పనుల గురించి సీఎంగారి నుంచి తెలుసుకున్నానని చెప్పాడు. ‘సార్ మీరు అనుకున్న అన్ని పనులను నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని మనోజ్ ట్వీట్ చేశాడు. మీ పాలనకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/