టిఆర్ఎస్ పార్టీ కి బిగ్ షాక్ : కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

టిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నాడు. నిన్న గురువారం విజయరెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరిన సంగతి తెలిసిందే.

రీసెంట్ గా తాటి వెంకటేశ్వర్లు మీడియా తో మాట్లాడుతూ.. ఉద్దేశ్య పూర్వకం గానే తనను పక్కన పెడుతున్నారని విమర్శలు చేసారు. తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కంటే నేనే సీనియర్ ని అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశంలో ఓడిపోయి టీఆర్ఎ స్ పార్టీ లో చేరి మళ్లీ గెలవలేని, దమ్ములేని తుమ్మల నాగేశ్వరరావు తనపై రాజకీయాలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించకపోతే తప్పనిసరిగా పార్టీ మారతానని తెలిపారు. ఇక ఇప్పుడు పార్టీ మారేందుకు డిసైడ్ అయ్యారు.

ఇక తాటి వెంకటేశ్వర్లు రాజకీయం విషయానికి వస్తే…తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి తొలిసారి టీడీపీ పార్టీ తరపున 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బూర్గంపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైసీపీ అభ్యర్థిగా అశ్వరావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండొవసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. తాటి వెంకటేశ్వర్లు అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయాడు.